ఏపీలోని టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనికోసం ఆలయాల వద్ద భారీగా మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం కింద సింహాచలం ఆలయం అభివృద్ధికి రూ.54.04 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. అంతేకాకుండా అన్నవరం ఆలయ అభివృద్ధికి రూ.63.48 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. శ్రీశైలం దేవస్థానంలోనూ రూ.43.49 కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టింది.