ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. కరోనాపై కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా పాజిటివ్ కేసుల శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని నిర్ణయించాయి.