అమూల్ రాకపోయి ఉంటే పాడి రైతుల పరిస్థితి దారుణంగా ఉండేదని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే చిత్తూరు డెయిరీ మూతపడిందని.. అది తన ఘనతేనని చంద్రబాబు తన సక్సెస్ స్టోరీలో రాసుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అమూల్ లీజ్ పాలసీపై అనవసరమైన రాద్దాంతం చేస్తున్నారని.. అమూల్ ద్వారా రూ.500 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి అప్పలరాజు క్లారిటీ ఇచ్చారు. తమ హయాంలో పాల రైతులు గతంలో చూడని ధరలు ఇప్పుడు కల్పిస్తున్నామని తెలిపారు.