గుడివాడ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్చార్జ్ రావి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం మున్సిపల్ మాజీ ఛైర్మన్ బాబా ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య తదితరులు పాల్గొని జన్మదిన కేక్‌ను కట్ చేసి రావికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పథకాల పేర్లు చెప్పి ప్రజలను ఆర్థిక పరుస్తుందని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. శేరీగొల్వేపల్లిలో మాజీ ఎమ్మెల్యే రావి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న రావితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముళ్లపూడి రమేష్ చౌదరి, సర్పంచ్ కాటూరి లక్ష్మీభవాని, మాజీ సర్పంచ్ మేరుగుమాల బసవపున్నయ్య, టీడీపీ నాయకులు కాటూరి శివాజీ, అంగడాల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.