ముఖ్యమంత్రి జగన్ పాలనలో మైనార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ముస్లింలంటే ముఖ్యమంత్రికి ఎందుకంత చిన్నచూపని వ్యాఖ్యలు చేశారు. నరసరావుపేటలో షేక్ ఇబ్రహీంను వైసీపీ మూకలు కిరాతకంగా చంపితే... సీఎం కనీసం సానుభూతి కూడా తెలపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షరీఫ్‌ను నిండుసభలో మంత్రులు దూషిస్తే.. జగన్ నోరెత్తలేదన్నారు. ప్రజలు ఏడుస్తుంటే పుట్టినరోజులు జరుపుకునే వ్యక్తి.. రాష్ట్ర నాయకుడా అని ప్రశ్నించారు. మైనార్టీలకు మంచి చేసింది చంద్రబాబే అని జలీల్‌ఖాన్ చెప్పుకొచ్చారు.