ట్విటర్ CEO ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. తాను సీఈవోగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. Twitter సీఈఓ బాధ్యతల్ని నిర్వహించగలిగే సమర్థుడు దొరికిన వెంటనే తాను ఆ పదవి నుంచి వైదొలగుతానని మస్క్ పేర్కొన్నారు. అయితే, ఈ ప్రకటనను ఆయన కాస్త వ్యగ్యంగా పోస్ట్ చేయడం గమనార్హం. ‘‘ఈ బాధ్యతల్ని తీసుకునే తెలివితక్కువ వ్యక్తి దొరగ్గానే నేను సీఈఓగా రాజీనామా చేస్తాను. తర్వాత నేను సాఫ్ట్‌వేర్, సర్వర్‌ల బృందాలను చూసుకుంటాను’’ అని ట్వీట్ చేశారు. కాగా ఇటీవల నిర్వహించిన పోల్‌లో మెజారిటీ సభ్యులు ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.