పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో జగన్నామ సంక్షేమ సంవత్సర కార్యక్రమాలను నేడు గౌ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకగా ప్రారంభించారు. 21 డిసెంబర్ 2022 నుండి 21 డిసెంబర్ 2023 సంవత్సర కాలంలో 51 గ్రామాల్లో జరగబోయే కార్యక్రమాలను మామిళ్లపల్లిలో ప్రారంభించారు. బజరంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అంబటి మురళీ కృష్ణ నేతృత్వంలో బజరంగ్ నేత్రజ్యోతి, విద్యావిజేత, తలసీమియా పరీక్షలు, వలంటీర్ల అవగాహనా పరీక్ష, నారీ ఋతువు కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.
మామిళ్లపల్లి గ్రామ ప్రజలకు నేత్ర పరీక్షలు నిర్వహించి, కళ్లజోళ్లు అవసరమైన వారికి రెండు వారాల్లోగా కళ్లజోళ్లు ఉచితంగా పంపిణి చేయనున్నారు. వాలంటీర్లకు అవగాహనా పరిక్షలు నిర్వహించి బహుమతులు అందజేయనున్నారు. విద్యార్థులకు పరీక్షా పాడ్లు, కిశోర బాలికలకు ఉచిత శానిటరీ నాప్కిన్స్ పంపిణి (నారి ఋతువు) వంటి సంక్షేమ కార్యక్రమాలకు మామిళ్లపల్లి నుండి శ్రీకారం చుట్టారు.త్వరలోనే మిగతా గ్రామాల వివరాలను తెలియపరుస్తామన్నారు