ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులందరికీ ట్యాబ్ లు అందజేస్తామని ప్రకటించారు. బాపట్ల జిల్లాలోని యడ్లపల్లిలో ఉచిత ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ "ప్రతి ఏటా 8వ తరగతికి వచ్చే విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్ లు పంపిణీ చేస్తాం. ట్యాబ్ ల ద్వారా విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమవుతాయి. నెట్ తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూడవచ్చు. వారం రోజుల్లోగా 4.59 లక్షల విద్యార్థులు, 59 వేల మంది టీచర్లకు ట్యాబ్ లు అందజేస్తాం" అని సీఎం తెలిపారు.