ఆకతాయిలకు భయపడిన ఓ ఎమ్మెల్యే, సమావేశానికి హెల్మెట్ పెట్టుకుని వచ్చారు. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అజయ్ చంద్రకార్ తన తలకు క్రికెట్ హెల్మెట్ ధరించి ఓ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్నారు. కాగా ఇటీవల సుపేలాలో జరిగిన మీటింగ్‌లో కొందరు ఆయనపై రాళ్లు రువ్వారు. ఆ ఘటనకు నిరసనగా మరో మీటింగ్‌లో పాల్గొన్న అజయ్ తన తలకు హెల్మెట్ ధరించారు. సమావేశంలో ఎమ్మెల్యే హెల్మెట్ పెట్టుకోవడాన్ని చూసిన అక్కడి జనాలు షాక్ అయ్యారు. ఈక్రమంలో ఆయన మాట్లాడుతూ, సుపేలా మీటింగ్‌లో రాళ్లు రువ్వారని, కానీ రాళ్లు రువ్వేవాళ్లు ఛత్తీస్‌ఘడ్ ప్రజలపై రువ్వుతున్న విషయాన్ని మరిచిపోయినట్లు ఆరోపించారు.