దేశంలోని మరో మూడు చారిత్రక ప్రదేశాలను ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక (టెన్టెటివ్) జాబితాలో చేర్చుతూ యునెస్కో నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మ స్థలం గుజరాత్‌లోని వాద్ నగర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల ఆన్‌కోర్‌వాట్‌గా పిలిచే త్రిపురలోని ఉనాకోటీ (రాతి శిల్పాలు)మొతెరాలోని సూర్య దేవాలయాలకు ఈ గౌరవం దక్కింది. తాజాగా చేర్చిన ఈ మూడు ప్రదేశాలతో కలిపి ప్రపంచ వారసత్వ కట్డడాలు, ప్రదేశాల జాబితాలో భారత్ నుంచి చేరిన వాటి సంఖ్య 52కు పెరిగింది.