చైనాలో కరోనా వైరస్ మరోసారి కల్లోలం సృష్టిస్తుంది. కరోనా బాధితులతో అక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రధాన నగరాల్లో శ్మశానవాటికలు మృతదేహాలతో కిక్కిరిపోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి.అటు చైనా ఈ వార్తలను కొట్టి పారేస్తోంది. కరనా కేసులను, మరణాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా అక్కడ కొవిడ్ కారణంగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదని చెప్తోంది. అక్కడి ప్రభుత్వ లెక్కల ప్రకారం, రాజధాని బీజింగ్‌లో సోమవారం 2, మంగళవారం ఐదు కరోనా మరణాలు సంభవించాయి. అయితే వాస్తవానికి మరణాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. బీజింగ్‌లోని కొన్ని శ్మశాన వాటికలు కొవిడ్ మృతులతో నిండిపోయాయని, అక్కడి ఆసుపత్రులు, శ్మశానవాటికల వద్ద భారీ సంఖ్యలో మృతదేహాలు ఉన్నట్టు చూపిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.