రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిపాలన మొదటిరోజు నుండే జగన్ అవినీతికి పాల్పడ్డారని, వైసీపీలో ఉన్నానంటే తనకే అసహ్యంగా ఉంది అన్నారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడు అనుకోలేదని వ్యాఖ్యానించారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ "ఈసారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పే. రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవ్వరూ కాపాడలేరు. పవన్ కళ్యాణ్ నిజాయితీని ప్రశ్నించలేం. రాష్ట్రం కోసం వాళ్లిద్దరూ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నా. నేను వైసీపీలోనే ఉన్నా, వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ తరుపునే పోటీ చేస్తా. మాజీ మంత్రి వివేకా హత్యకేసు జనవరి 3 నుండి మలుపులు తిరగనుంది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై సుప్రీం తీర్పు తర్వాత చాలామంది మెడకు ఉచ్చు బిగుస్తుంది." అని అన్నారు.