నాగ్‌పూర్ రైల్వే స్టేషన్లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. రైలు ఎక్కుతూ ఓ ప్రయాణికుడు ప్రమాదానికి గురయ్యాడు. కదులుతున్న రైలుకు, ప్లాట్ఫారానికి మధ్య చిక్కుకుపోయాడు. ఈ ప్రమాదాన్ని గుర్తించి టీటీఈ గగన్‌దీప్ సింగ్ వెంటనే స్పందించాడు. పరుగెత్తుకుని వెళ్లి రైలు కింద పడిపోతున్న ప్రయాణికుడిని బయటికి లాగారు. తర్వాత రైలు ఎక్కించారు. దీనికి సంబంధించిన వీడియోను సెంట్రల్ రైల్వే ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రయాణికుడి ప్రాణాన్ని కాపాడిన టీటీఈ గగన్‌దీప్ సింగ్‌ను ప్రశంసించింది.