ఖమ్మంలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. తెలుగుదేశం జెండా పట్టుకుని యువత ముందుకు వచ్చి పార్టీ రుణం తీర్చుకుందన్నారు.టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని భవిష్యత్తుకు నాంది పలకబోతోందని వివరించారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అసాధ్యాలను సుసాధ్యం చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. తనకు కావలసింది అధికారం కాదని ప్రజల అభిమానమని వెల్లడించారు. తాను ఎన్నడూ ఎన్నికల కోసం, ఓట్ల కోసం పని చేయలేదని స్పష్టం చేశారు. నేను మీ ఆత్మ బంధువుగా ఉండాలనుకుంటున్నాను అని ఉద్ఘాటించారు. వయసులో పెద్దవాడినైనా యువత కంటే ముందు చూపుతో ఆలోచిస్తానని చెప్పారు. ఐటీ రంగ ప్రాధాన్యతను 25 ఏళ్ల క్రితమే గుర్తించామని చంద్రబాబు వెల్లడించారు. యువతకు ఐటీ రంగాన్ని ప్రోత్సహించామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa