భారతదేశంలో కరోనా పరిస్థితిపై జరిగిన సమావేశంలో ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే కోవిడ్ పరీక్షలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. నేటి నుంచి ర్యాండమ్ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కోవిడ్ ముప్పు ఇంకా ముగియలేదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని మన్సుఖ్ హెచ్చరించారు. కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకోని వారందరూ ముందుగానే తీసుకోవాలని మరియు రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని సూచించారు.