ఓ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. రాంగ్ రూట్లో ఓ కారు వేగంగా దూసుకువచ్చి.. ఎదురుగా వస్తోన్న మరో కారును ఢీకొట్టినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ ప్రమాదం దాటికి కారులో ఉన్న యువతి గాలిలో 10 పల్టీలు కొట్టింది. దాదాపు 10 సెకన్ల పాటు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె మరణించినట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని, వాహనాలను జాగ్రత్తగా నడపాలంటూ వారు సూచిస్తున్నారు.