ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో సీఎం వైయస్ జగన్ బుధవారం లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ... ముందుగా దేశానికి, జాతికి సంఖ్యాబలం ముఖ్యం కాదు, విద్యావంతులై ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో బతికినప్పుడే ఈ సమాజంలో గౌరవం ఉంటుందన్న అంబేద్కర్ గారి ఆలోచనా విధానం, మనిషిని మహాత్మునిగా తీర్చిదిద్దాలంటే చదువు ఒక్కటే మార్గమని సూచించిన మహాత్మా జ్యోతిరావుపూలే గారి ఆలోచనా విధానం, ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైనది విద్య అని చెప్పిన నెల్సన్‌మండేలా ఆలోచనా విధానం, ఇదే బాటలో మన రాష్ట్రంలో పేద పిల్లల తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే ముఖ్యమన్న సీఎంగారి ఆలోచనలు ఒక్కటే అని కొనియాడారు.