అరాచకాలకు అడ్డాగా వైసీపీ పాలన మారిందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా,కొడవలూరు మండలంలోని నార్తు రాజుపాలెంలో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... అక్రమ గ్రావెల్, ఇసుక, భూమాఫియా, కక్షసాధింపు చర్యలతో రాష్ట్ర భవిష్యత్త్ ప్రమాదంలోకి నెట్టారని అన్నారు. నియోజకవర్గం నేడు మాఫియాలకు అడ్డాగా మారిందన్నారు. చంద్రబాబు నాయుడు ఈనెల 30న నియోజకవర్గంలో పర్యటించనున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, చెక్కా మదన్, గరికపాటి రాజేంద్రకుమార్, కరకటి మల్లికార్జున, జొన్న శివకుమార్, కేతు వెంకటరమణారెడ్డి, నాసిన ప్రసాద్ పాల్గొన్నారు.