ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దళిత, గిరిజన ద్రోహి అని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి దుయ్యబట్టారు.మండలంలోని గంగపట్నం పంచాయతీలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన ఇదేంఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు దళిత, గిరిజనులకు సబ్‌ప్లాన్ ద్వారా నిధులు మంజూరు చేస్తే వాటిని దుర్వినియోగం చేశాయని సజ్జల వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సజ్జల వ్యాఖ్యలు దళిత, గిరిజన ప్రజలు ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. ఆక్వా, వరి రైతులు బాగుపడాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆర్. వీరేంద్రచౌదరి, పీ. చెంచుకిషోర్ యాదవ్, సీహెచ్. కృష్ణచైతన్య, ఎం. రంగారావు, కే సుధాకర్‌రెడ్డి, జీ కృష్ణారెడ్డి, జీ అనీల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.