పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కర్నూలు లోక్సభ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు కర్నూలు డీఎస్పీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో కనిపిస్తున్న ఆదరాభిమానాలను చూసి ప్రభుత్వం భయాందోళనకు గురవుతోందని అన్నారు. ఇందులో భాగంగా మాచర్ల ఘటన జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శలు నంద్యాల నాగేంద్ర కుమార్, పోతురాజు రవికుమార్, సత్రం రామకృష్ణుడు పాల్గొన్నారు.