కర్నూలు నగరంలో గ్రీనల్యాండ్ అగ్రికల్చర్ కాలేజీ మూడు నెలల కిందటే బోర్డు తిప్పేసినట్టు తెలుస్తోంది. అగ్రికల్చర్ కోర్సు చదివితే భవిష్యత్తు బాగుంటుందని రూ. లక్షలు అప్పులు చేసి తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ కాలేజీల్లో చేర్పించారు. దాదాపు 300 మందికిపైగా కాలేజీల చేరినట్టు తెలుస్తోంది. ఫీజులు వసూలు చేసుకొని యాజమాన్యం బోర్డు తిప్పయడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు తాలూ కా పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. మూడు నెలల కిందటే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎలాంటి కదలిక లేకపోవడంతో మరోసారి పోలీసులనాశ్రయించారు.