మాతృభాషలో ఇంజనీరింగ్ విద్యను బోధించేందుకు బాటలు వేయడం శుభపరిణామమని అనంతపురం జేఎనటీయూ వీసీ రంగజనార్దన పేర్కొన్నారు. బుధవారం జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాలలో అనువాదకులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. వీసీ రంగజనార్దన, ఏఐసీటీఈ అటల్ ఎఫ్‌డీపీ డైరెక్టర్ డాక్టర్ దినేష్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిప్రజ్వలనతో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేయడానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జేఎనటీయూ అనువాద కేంద్రంగా మొదటి సంవత్సరం డిగ్రీ, డిప్లొమా పాఠ్యపుస్తకాల అనువాదం ముగిసింద న్నారు. రెండో సంవత్సరంలో 88 పాఠ్యపుస్తకాలను అనువాదం చేస్తున్నామ న్నారు. ఆంగ్లం నుంచి ప్రాంతీయభాషల అనువాదానికి ఉడాన యాప్‌ను రూపొందించి నట్లు తెలిపారు. దినేష్‌సింగ్ మాట్లాడుతూ.... మాతృభాషలో బోధించడం ద్వారా పాఠ్యాంశ సారాంశాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి అవకాశముంటుందన్నారు. అనంతరం ప్రొఫెసర్‌లు రాజీవ్‌కుమార్, మమత అగర్వాల్ ఆనలైనలో అనువాద ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుజాత, ఎఫ్‌డీపీ డైరెక్టర్ భానుమూర్తి, కోఆర్డినేటర్ శేషమహేశ్వరమ్మ, బోధన, బోధనేతర సిబ్బంది, పీర్వో డాక్టర్ మారాల రామశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.