విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కొమ్ముకోనం, టూనా చేపల విక్రయాలతో కళకళలాడుతోంది. రెండు రోజులుగా మత్స్యకారులకు భారీ సైజులో కొమ్ముకోనం, టూనా చేపలు లభిస్తున్నాయి. వాటిని బోట్ల నుంచి జెట్టీ పైకి చేర్చడానికి శ్రమపడాల్సి వస్తోంది. ఒక్కో కొమ్ముకోనం విక్రయిస్తే రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు లభిస్తున్నాయని జాలర్లు సంతోషిస్తున్నారు.