దివాలా తీసిన సంస్థ బైజూ్‌సతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం విజయవాడలో మాట్లాడుతూ.. బైజూస్ నాణ్యతకు ఎలాంటి సాధికారత లేదని, అది నాణ్యమైన విద్య అని ఎవరూ రుజువు చేయలేదని తెలిపారు. ఎవరితో సంప్రదించి ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.