బీఎఫ్ 7 వేరియంట్‌పై ప్రపంచ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారత్ లో కూడా ఈ టెన్షన్ మొదలైంది. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. చైనాలో చూపిస్తున్నట్టుగా ఆ వేరియంట్ భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపకపోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో ఇవాళ మాట్లాడారు. ‘‘భారతదేశంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారు సురక్షితంగా ఉన్నారని నిరూపించడానికి మా వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి. అన్ని వేరియంట్లను పర్యవేక్షించడం చాలా ముఖ్యం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వైరస్ వల్ల మనం తీవ్రమైన సమస్యను ఎదుర్కొనే అవకాశం లేదు’’ అని పేర్కొన్నారు.