దేశీయ రిటైల్ రంగంలో మరింత బలోపేతం అయ్యే దిశగా రిలయన్స్ ఇంజస్ట్రీస్ అడుగులు వేస్తోంది. తాజాగా జర్మనీ సంస్థ మెట్రో ఏజీ భారత్ లో మెట్రో క్యాష్ అండ్ క్యారీ పేరిట నిర్వహిస్తున్న టోకు వ్యాపారాన్ని రిలయన్స్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.2,850 కోట్లు. ఈ మొత్తాన్ని పూర్తిగా నగదు రూపంలో చెల్లించేటట్లుగా ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. మెట్రో ఇండియా 2003లో భారత మార్కెట్లోకి ప్రవేశించగా, ప్రస్తుతం దేశంలోని 21 నగరాల్లో 31 హోల్ సేల్ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థలో ప్రస్తుతం 3,500 మంది ఉద్యోగులున్నారు.