ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్న ఉచిత ట్యాబ్ లను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 23, 440 మంది విద్యార్థులకు ఉచిత ట్యాబ్ లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.