కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామంలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు బుధవారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్ళి 15 అంశాల గురించి నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, కరెంట్, ఆర్టీసి చార్జీలు, నాసిరకం మద్యం ధరలు, ఇసుక కొరత, నిరుద్యోగం ఇలా తదితర అంశాల గురించి ప్రజలతో వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుని వాటిని నమోదు చేసుకోవడం జరిగింది. ఆ తరువాత ప్రజల తరుపున వైసిపి ప్రభుత్వం పై జగన్ రెడ్డి అసమర్థ పాలనపై పోరాడుతుందని ఆ పోరాటానికి మద్దతుగా +91- 92612 92612 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు నిమ్మగడ్డ రవీంద్రనాథ్, కొండ్రేడ్డి పూర్ణ, సూదగాని సత్యనారాయణ, వాడపల్లి రాధాకృష్ణ, రాంబాబు, బాబి గర్సికుటి సత్యనారాయణ, రాజేశ్వరరావు, ఆదూరి సత్యనారాయణ, పసుమర్తి భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.