వైకాపా ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాకే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. వల్లంపట్ల పంచాయతీ సాయంకాలం తిరుపతి పాడు గ్రామంలో బుధవారం సాయంత్రం గడపగడపతో కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి పాడు జగనన్న కాలనీలో లబ్ధిదారులతో మాజీ ఎమ్మెల్యే పాతపాటి స్వరాజుతో కలిసి మన నూతన గృహం ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీ, జెడ్పిటిసి సభ్యుడు సూరిబాబు, ఎమ్మెల్సీ, చైర్పర్సన్ శ్రీను పాల్గొన్నారు.