శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో వైసీపీ అధికార పార్టీ నాయకులుమూడు బృందాలుగా విడిపోయారు. దీంతో వైసీపీ రాజకీయం మూడుముక్కలాటగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు హిందూపురంలో 3 ప్రదేశాల్లో వేరువేరుగా చేశారు. ముందుగా నవీన్ నిలిచిన వర్గంఅంబేద్కర్ సర్కిల్లో కేక్ కట్ చేసి జరుపుకున్నారు. తర్వాత చూడు రామకృష్ణారెడ్డి సోదరి మధుమతి రెడ్డిఉచిత రక్తదానం చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మరలా హిందూపురం ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఓ ఫంక్షన్ హాల్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ అన్ని సంబరాల్లోనూ హిందూపురం పరిశీలకులు ఈశ్వర్ రెడ్డి అందరితో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. రాబోవు ఎన్నికల్లో హిందూపురం వైసీపీ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోనని ప్రజలకు సొగసలాడుతున్నాను.