దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. వరుసగా మూడో రోజు మార్కెట్లు నష్టపోయాయి.ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయి 60,826 వద్ద ముగిసింది. నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 18,127 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : అల్ట్రాటెక్ సిమెంట్ (0.71%), ఇన్ఫోసిస్ (0.68%), ఏషియన్ పెయింట్స్ (0.65%), కోటక్ బ్యాంక్ (0.58%), సన్ ఫార్మా (0.52%).
టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-2.61%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.55%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.26%), టాటా మోటార్స్ (-2.12%), ఎల్ అండ్ టి (-1.70%).