ఆంధ్రప్రదేశ్ లో ఒకటో తేదీని ప్రభుత్వ ఉద్యోగులు మరిచిపోయే పరిస్థితి ఉందని ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు ప్రభుత్వం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. బకాయిల కోసం ప్రభుత్వం సంక్రాంతి వరకు గడువు విధించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కొత్త కలెక్టరేట్లలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు.