ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలోని యూనివర్సిటీలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దు : పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 22, 2022, 10:10 PM

రాష్ట్రంలోని యూనివర్సిటీలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హితవు పలికారు. విద్యార్థులకు సామాజిక, రాజకీయ, ప్రాపంచిక విషయాలపై విశ్వవిద్యాలయాలు అవగాహన కల్పించాలని, అయితే ఏపీలోని పేరున్న యూనివర్సిటీలు ఆ బాధ్యతను విస్మరించి అధికార పార్టీ కార్యకర్తలను తయారు చేసే పనిలో ఉన్నాయా అనే సందేహం కలుగుతోందని పవన్  తెలిపారు. యూనివర్సిటీలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చి ఆ పార్టీ ముఖ్యమంత్రి ఫ్లెక్సీలతో ప్రాంగణం నింపిన తీరు విద్యార్థి లోకానికి, సమాజానికి ఏమి సూచిస్తుందని ప్రశ్నించారు. ఫ్లెక్సీలు పర్యావరణానికి విపరీతమైన హాని కలిగిస్తున్నాయని సందేశం ఇచ్చిన వైసిపి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడానికి ఫ్లెక్సీలు కట్టడం విచిత్రంగా ఉందని పవన్ పేర్కొన్నారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com