వేంపల్లె పట్టణంలో స్థానిక శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కరస్పాండెంట్ బి. చక్రపాణి రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆ పాఠశాల ఆవరణలో ఏసుక్రీస్తు పాకను ఏర్పాటు చేశారు. అలాగే కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. అనంతరం చిన్నారులు క్రిస్మస్ తాత వేషధారణలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్మస్ యొక్క ప్రాముఖ్యతను, ఏసుక్రీస్తు గొప్పతనాన్ని, జననం గురించి విధ్యార్థులకు వివరించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, వివిధ వేషధారణలు, రకరకాల బొమ్మలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు చేతన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa