మహారాష్ట్రలోని సతారా జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే జయకుమార్ గోర్ కారు ప్రమాదానికి గురైంది. శనివారం ప్రాంతంలో పూణె-పంఢర్‌పూర్ రోడ్డులోని శ్మశానవాటిక సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వంతెనపై నుంచి వాగులో పడిపోయింది.జయకుమార్ గోర్‌కు పక్కటెముక ఫ్రాక్చర్ కావడంతో పూణేలోని రూబీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బీజేపీ నాయకుడితో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం బారామతిలోని ఆసుపత్రిలో చేరగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa