తిరుమలలో జనవరి 2 నుంచి 11 వరకు భక్తులకు వైకుంఠ దర్శనం కల్పిస్తామని సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. సోమవారం వైకుంఠ ద్వారదర్శనం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దర్శన టిక్కెట్లు, టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే వైకుంఠ దర్శనానికి అనుమతిస్తారు. జనవరి 1న తిరుపతిలో 9 చోట్ల సర్వదర్శనం టోకెన్లు అందజేస్తామని.. రోజుకు 50 వేల చొప్పున 10 రోజులకు 5 లక్షల టోకెన్లు అందజేస్తామని తెలిపారు.