జగనన్న శాశ్వత భూమి హక్కులు, భూ పరిరక్షణపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. వందేళ్ల తర్వాత భూములను రీ సర్వే చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. సర్వేలో నాణ్యత పాటించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందిని నియమించాలన్నారు. 22-ఏ సమస్యను పరిష్కరించి హక్కు పత్రాలు అందజేయాలని, సమగ్ర భూ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.