పలు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం మంగళవారం డబ్బులు జమ చేయనుంది. నవరత్నాల పథకాల కింద అర్హత కలిగి ఉండి, గతంలో లబ్ధి పొందలేకపోయిన వారి నుంచి ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులు స్వీకరించింది. వీటి ద్వారా పథకాల లబ్ధి పొందేందుకు 2.79 లక్షల మంది అర్హులని ప్రభుత్వం గుర్తించింది. దీంతో వివిధ పథకాలకు సంబంధించి 2,79 లక్షల మంది ఖాతాల్లో నేడు రూ.590.91 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది.