భారత్లో అత్యధికంగా భక్తులు సందర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల శ్రీవారి ఆలయం రెండో స్థానంలో నిలిచింది. ఇందులో వారణాసి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ మేరకు ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టు వెల్లడించింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా భక్తులు చూసిన దర్శనీయ, పర్యాటక ప్రాంతాలపై సర్వే నిర్వహించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కరోనా ఆంక్షలను ప్రభుత్వం సడలించడంతో తిరుమల భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక పూరీ, షిరిడీ, హరిద్వార్ తరువాతి స్థానాల్లో నిలిచాయి.