ప్రతి ఒక్కరికి సబ్జా గింజలు అంటే తెలిసే ఉంటుంది. సాధారణంగా పానీయాల్లో కలుపుకొని తాగుతారు. కానీ వీటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అధిక బరువు ఉన్నవారు సబ్జా గింజలు తింటే బరువు తగ్గుతారు. వీటితో జీర్ణ సంబంధిత, గ్యాస్, యాసిడిటీ లాంటి సమస్యలు తగ్గుతాయి. సబ్జా గింజలను పొడిచేసి గాయాలపై వేసి కట్టు కడితే త్వరగా మానిపోతాయి. సబ్జా గింజలను నీటిలో కలుపుకొని తాగితే తలనొప్పి, నీరసం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.