జపాన్‌లో హిమపాతం బీభత్సం సృష్టించింది. సాధారణం కంటే మూడు రెట్లు అధికంగా హిమపాతం నమోదవుతోంది. దీంతో 17 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 90 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. జపాన్ ఉత్తర తీర ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అనేక నగరాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అక్కడి ఓ ప్రధాన ద్వీపంలో విద్యుత్ కేంద్రం ధ్వంసమవడం వల్ల 20వేల ఇళ్లలో అంధకారం అలుముకుంది. విద్యుత్ లేక ఇళ్లలోని హీటర్‌లు పనిచేయక ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. రహదారులు, వంతెనలపై మంచు అడుగుల మేర పేరుకుపోయింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.