పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో గల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆయన సతీమణి వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వంశీ దంపతుల కుమార్తెకు తలనీలాలను స్వామివారికి సమర్పించి, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలను పొందారు. ఇదే విధంగా ఎమ్మెల్సీ ఇందుకూరి దంపతులు కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని తన స్నేహితుడి కుమార్తెకు మేనమామ హోదాలో చెవి కుట్లు వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందుకూరి దంపతులు చిన్నారిని ఆశీర్వదించారు.