వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను డిసెంబర్ 28వ తేదీన శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ వద్ద వేలంపాట నిర్వహించనున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్ నరేంద్ర కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కేసుల్లో పట్టుబడిన ఒక ఆటో, మూడు ద్విచక్ర వాహనాలకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల వేలం పాటదారులు మంగళవారం తమ కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని ఆయన కోరారు. వాహనాలను వేలం పాడుకున్న వేలం పాటదారులు జిఎస్టి తో కలిపి నగదును తక్షణమే చెల్లించాలని ఆయన తెలిపారు.