ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో ప్రజారాంజిక పాలన: నందిగామ ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 27, 2022, 11:24 AM

నందిగామ మండలంలోని కమ్మవారిపాలెం గ్రామంలో సోమవారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు , ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతుందని , ప్రతి హామీ అమలు చేస్తూ ప్రజలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని తెలిపారు , ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడంతో పాటు ప్రజలకు పాలనా ఫలాలు అందుతున్న తీరు తెలుసుకున్నారు , ఇంకా సమస్యలు ఉంటే పరిష్కారానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని ప్రజలతో నాయకులు, అధికారులు మమేకం కావడమే ముఖ్య ఉద్దేశమన్నారు , అవినీతికి తావులేని పాలతో ప్రజలకు మేలు జరుగుతుంటే ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు , ప్రభుత్వంపై బురద చల్లి ప్రయోజనం పొందాలని కూయుక్తులు పన్నుతున్నాయని -ప్రజలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు , ఎన్ని అవంతరాలు ఎదురైనా రాష్ట్ర అభివృద్ధికి -ప్రజా సంక్షేమానికి సీఎం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెంటమాల నిర్మల-రాజేంద్ర, మాజీ సర్పంచ్ వేల్పుల కిషోర్, ఎంపీటీసీ పెసరమల్లి రమాదేవి-స్టాలిన్, మండల కన్వీనర్ శివ నాగేశ్వరరావు, నాయకులు చండ్ర కోటేశ్వరరావు, జంపాని సుబ్బారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు , సచివాలయ సిబ్బంది , పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com