ఏపీలో సామాజిక పింఛన్ ను రూ.2,750కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2023, జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో నెంబర్ 113 జారీ చేసింది. వృద్ధులతో పాటు వితంతు, ఒంటరి మహిళ, చేనేత, కల్లుగీత కార్మికులు, చర్మకారులు, మత్స్యకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, తదితరులకు ప్రతి నెలా ఒకటో తేదీన ఇచ్చే సామాజిక పింఛన్ మొత్తాన్ని రూ.2500 నుంచి రూ.2,750కి పెంచుతూ రాష్ట్ర సర్కార్ జీవో జారీ చేసింది.