మహారాష్ట్ర సతారాలో విషాద ఘటన జరిగింది. చాక్లెట్ గొంతులో ఇరుక్కుని ఏడాదిన్నర చిన్నారి మరణించింది. ఓ గ్రామానికి చెందిన చిన్నారికి ఇంటి పక్కన ఉండే వారు చాక్లెట్ కొనిచ్చారు. ఆమె నోట్లో వేసుకోగా గొంతులోనే ఇరుక్కుపోయింది. దీంతో శ్వాస ఆడక చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన చిన్నారి తల్లి వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా.. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.