తనతో మాట్లాడటం మానేసిందనే కోపంతో 20 ఏళ్ల యువతిని స్క్రూడ్రైవర్‌తో 51సార్లు పొడిచాడు ఓ కిరాతకుడు. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో డిసెంబర్ 24న జరిగింది. యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె మొహానికి దిండు అడ్డం పెట్టి స్క్రూడ్రైవర్‌తో దారుణంగా దాడి చేశాడు. యువతి సోదరుడు వచ్చి చూసేసరికి ఆమె రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. జష్‌పుర్ జిల్లాకు చెందిన నిందితుడు బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో అందులో ప్రయాణిస్తున్న యువతితో పెంచుకున్నాడు. అ తర్వాత ఆమెతో ఫోన్లో టచ్‌లో ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆమె అతడితో మాట్లాడటం మానేసేసరికి అతడు బాధితురాలి తల్లిదండ్రులను సైతం బెదిరించినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.