ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడద రజనీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా చిలకలూరిపేట మండలంలో గ్రానైట్ తవ్వకాలకు అసైన్డ్ భూముల కేటాయింపుపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. తవ్వకాలకు రెవెన్యూ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ ఓసీ) ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను బెదిరించి అక్రమంగా ఎన్‌ఓసీ జారీ చేశారని ఆరోపించారు.రైతుల పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు మంత్రి విడదల రజనీ, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాపరెడ్డి, తహసీల్దార్, సీఐ, ఎస్ ఐలకు నోటీసులు జారీ చేసింది.పిటీషన్ల దృష్ట్యా, గ్రానైట్ మైనింగ్ లీజును కోర్టు తుది నిర్ణయమే నిర్ణయిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.