సాధారణంగా యాలకులను ఎక్కువగా వంటకాలలో ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని రోజూ రాత్రి పడుకునే ముందు రెండు చొప్పున తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పురుషులలో శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. శీఘ్ర స్కలన సమస్యను పోగొట్టి ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనేలా చేస్తాయి. వీర్య కణాల సంఖ్యను గణనీయంగా పెంచుతాయి. యాలకుల వల్ల బరువు కూడా తగ్గొచ్చు. అంతే కాకుండా రక్తాన్ని శుద్ధి చేసి, శరీరంలో మలినాలను తొలగిస్తాయి. నోటి దుర్వాసనను పోగొట్టి, నోటి ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.