తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ నుండి వచ్చి ఏపీ లో స్థిరపడాలనుకునేవారికి స్థానికులుగా గుర్తించేందుకు కేంద్రం ఏడేళ్లు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ గడువును మరో మూడేళ్లపాటు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ ఉత్తర్వుపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, స్థానికత వెసులుబాటు ఎవరికైనా కేవలం ఒక్కసారే వర్తిస్తుంది. ఏపీలో నివాసం ఏర్పరుచుకున్న వారికి, వారు ఎంచుకున్న జిల్లాలో ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు.